Home Page SliderNational

“రాజువయ్యా..మహరాజువయ్యా”..ప్రభాస్ భూరివిరాళం

తెలుగురాష్ట్రాలు వరదలతో విలవిల్లాడుతుంటే చిత్ర పరిశ్రమలో ప్రముఖులందరూ విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండే హీరో ప్రభాస్ ఎంత విరాళం ఇస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ మొదలు పెట్టిన సీఎం సహాయనిధి విరాళాలను మిగిలిన హారోలు అందరూ కొనసాగించారు. అయితే ప్రభాస్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎవ్వరూ ఇవ్వనంత విరాళం ప్రకటించారు. తనవంతు సాయంగా ఏపీకి రూ.కోటి, తెలంగాణకు రూ.కోటి ఇస్తున్నట్లు వెల్లడించారు. దీనితో ఆయన అభిమానులు “ఆయన ఎక్కడున్నా రాజే, మహారాజు” అంటూ మెచ్చుకుంటున్నారు. బాహుబలి చిత్రంలో మహారాజుగా ప్రభాస్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన కలియుగ కర్ణుడని కొనియాడుతున్నారు.