InternationalNews

వచ్చాడయ్యో సామీ… వారం తర్వాత ప్రత్యక్షమైన చైనా అధ్యక్షుడు జీజిన్పింగ్

తిరుగుబాటు వార్తల తర్వాత దర్శనమిచ్చిన చైనా అధ్యక్షుడు
తిరుగుబాటు చేశారని చెప్పిన వ్యక్తులతో కలిసి దర్శనం
నా రూటే సెపరేట్ అంటున్న చైనా అధ్యక్షుడు జీజిన్పింగ్
కరోనా నిబంధనల వల్ల బయటకు రాలేదన్న అభిప్రాయం
ఉజ్బెకిస్తాన్ పర్యటన తర్వాత కన్పించిన చైనా అధినేత

తిరుగుబాటు వార్తల తర్వాత మీడియాకు దర్శనిమిచ్చాడు చైనా అధ్యక్షుడు జీజిన్పింగ్. చైనా కోవిడ్ ప్రోటోకాల్‌ అనుగుణంగా… అంతర్జాతీయంగా వచ్చే వారందరూ ఏడు రోజుల హోటల్ నిర్బంధంలో ఉండాలి. ఆ తర్వాత మూడు రోజుల హోమ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందే. రెండేళ్ల విదేశీ పర్యటన తర్వాత… చైనా అధ్యక్షుడు జీజిన్పింగ్ వారం రోజుల తర్వాత ఇవాళ మొదటసారిగా పబ్లిక్ మీటింగ్‌కు హాజరయ్యారు. గత దశాబ్దంలో చైనా సాధించిన విజయాల గురించి మంగళవారం బీజింగ్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌ను మాస్క్ ధరించి అధ్యక్షుడు వచ్చారని ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా రిపోర్ట్ చేసింది. చైనీస్ నాయకుడు పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలోని ఇతర ఆరుగురు సభ్యులతో కలిసి.. జీ జిన్పింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పలువురు నేతలు జీన్పింగ్‌ను అధికారంలోకి తొలగించేందుకు రంగం సిద్ధం చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరూ ఐక్యంగా ఉన్నా్మన్న భావన ఆయన కలిగించారు. సెప్టెంబరు 16న అర్ధరాత్రి ఉజ్బెకిస్తాన్‌లోని శిఖరాగ్ర సమావేశం నుండి బీజింగ్‌కు తిరిగి వచ్చిన తర్వాత జీ… తొలిసారి మంగళవారం బహిరంగంగా కనిపించారు. ఆ పర్యటనకు ముందు, చివరిసారిగా జనవరి 2020లో విదేశాలకు వెళ్లారు. మయన్మార్‌ను సందర్శించిన కొన్ని రోజుల ముందు సెంట్రల్ సిటీ వుహాన్‌ను సందర్శించారు. కరోనా విలయతాండవం జరిగిన వుహాన్ పర్యటనకు అధ్యక్షుడు జీ వెళ్లడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కారణమయ్యింది. కోవిడ్ జీరో నిబంధనలకు కట్టుబడి ఉండటం వల్ల ఆయన వారం రోజుల తర్వాత మాత్రమే బయటకు వచ్చారంటున్నారు. ఈ జులైలో హాంకాంగ్‌లో 25 ఏళ్ల చైనా పాలనకు గుర్తుగా రెండు రోజుల పర్యటన తర్వాత దాదాపు రెండు వారాల పాటు చైనా నాయకుడు బహిరంగంగా కనిపించలేదు.

ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌లో అనేక మంది సహచరులను కలిసినప్పుడు జీ మాస్క్ ధరించారు. మాస్క్ లేని విందు సమావేశంలోనూ పాల్గొనలేదు. జీ కఠినమైన కోవిడ్ నిబంధనలు తన నాయకత్వానికి మూలస్తంభంగా మార్చాయన్న అభిప్రాయం ఉంది. చైనా మీడియా లెక్కలను పక్కనబెడితే అమెరికాతోపాటు, పాశ్చాత్య మీడియా చైనాలో కరోనా ఘోరాల గురించి ఎన్నో కథలు ప్రసారం చేశాయ్. వచ్చే నెలలో దశాబ్దంలో రెండుసార్లు నాయకత్వం వహించిన జీ.. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తరుణంలో కరోనా ఆంక్షలపై కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.