తమిళనాడులో భారీ వర్షాలు -విద్యాసంస్థలకు సెలవులు
వేసవి తాపంతో హీటెక్కిన తమిళనాడు చల్లబడుతోంది. రుతు పవనాల కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో గాలులకు భారీ వృక్షాలు నేలకూలాయి. రెండు రోజులుగా వర్షాలు కురస్తుండడంతో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. తిరువణ్ణామలై, తిరుపత్తూర్, కాంచీపురంలో విద్యాసంస్థలకు భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటించారు. చెన్నైలో కూడా అడయార్, నంగనల్లూర్ ప్రాంతాలలో వృక్షాలు నేలకూలాయని, వాటిని తొలగిస్తున్నట్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తెలిపింది.