Andhra PradeshHome Page Slider

ఏపీలో భారీ వర్షాలు.. దూసుకువస్తున్న ‘మాండూస్‌’ తుఫాను

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా దూసుకువస్తోంది. ఈ తుఫానుకు ‘మాండూస్‌’గా నామకరణం చేశారు. ప్రస్తుతం తుఫాను గంటకు 12 కి.మీ. వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు వైపుగా దూసుకు వస్తోంది. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలోల అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోని చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు కురస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 5 ఎన్డీఆర్‌ఎఫ్‌, 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు. ఏపీకి భారీ వర్ష సూచన నేపథ్యంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అలర్ట్‌ ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. మరోవైపు తుఫాను నేపథ్యంలో తమిళనాడులో 6 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.