ఏపీలో మరికాసేపట్లో భారీలో వర్షాలు
ఇటీవల కురుసిన అకాల వర్షాల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రల్లోని ప్రజలు,రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా రెండు రాష్ట్రాలలోని ప్రజలు ఇప్పుడిప్పుడే వీటిని నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే వాతావరణశాఖ మరోసారి తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు చేదు కబురు అందించింది. అదేంటంటే తెలుగు రాష్ట్రాలలోని ఏపీలో మరి కాసేపట్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. కాగా తెలంగాణాలో ఈ రోజు వర్షాలు పడే ఛాన్స్ లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఏపీలోని శ్రీకాకుళం,అనకాపల్లి,కృష్ణా,ఏలూరు,విజయవాడ,గుంటూరు,ఒంగోలు,తిరుపతి జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. కాగా ఇప్పటికే పలు ప్రాంతాలలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో వాతావరణశాఖ అధికారులు ఏపీలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని,అవసరమైతేనే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.