ఏపికి అతి బారీ వర్ష సూచన
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపికి మూడు రోజుల పాటు విశాఖ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది.రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు,ఎల్లుండి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.