డ్రగ్స్ కేసులో దొరకకుండా ఉండేందుకే చికిత్స తీసుకున్నారు…
మంత్రి కేటీఆర్ సవాల్‌కు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తాము సవాల్ చేసింది ఎప్పుడు? మీరు స్పందించింది ఎప్పుడని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో దొరక్కుండా ఉండేందుకు విదేశాల్లో చికిత్స తీసుకున్నారని ఆరోపించారు. గతంలో ఎప్పుడో చేసిన సవాల్‌కు ఇప్పుడు టెస్టులకు రెడీ అంటున్నాడని విమర్శించారు. అన్ని టెస్టులకు ప్రిపేర్ అయి ఇప్పుడు రెడీ అంటున్నాడని ధ్వజమెత్తారు. తాను తాంబాకు తింటున్నట్లు కేటీఆర్ ప్రచారం చేస్తున్నాడని, తాంబాకు తిన్నట్టు ఆధారాలు ఉన్నయా? అని ప్రశ్నించారు. మీ చెల్లి లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడరని బండి నిలదీశారు. ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ భయం మొదలయిందన్నారు. డ్రగ్స్ కేసు గుంజితే కొడుకు విషయం తెలుస్తుందన విచారణ మూసేశారన్నారు. హైదరబాద్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎందుకు ఆగిందని నిలదీశారు. డ్రగ్స్ కేసులో ఎవరున్నారనే విషయాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయన్నారు బండి సంజయ్. అసలు కేటీఆర్ ముందే టెస్టులు చేయించుకోవడానికి కారణమేంటి? సిట్ నివేదిక బయటపెట్టాలన్నారు. వేములవాడకు ఇస్తామన్న 400 కోట్లు ఏమి అయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు.
