Home Page SliderNational

తుపాకీ గురిపెట్టి.. 80 లక్షలు కొట్టేశాడు!

80 లక్షల బ్యాగుతో వెళ్తున్న వ్యక్తిని ఓ దుండగుడు తుపాకీ చూపించి దోచుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లిలో చోటు చేసుకుంది. లాహోరీ గేట్ మార్కెట్ ప్రాంతంలో బాధితుడి వెనకాలే ఫాలో అయిన నిందితుడు తుపాకీతో బెదిరించాడు. తర్వాత కొన్ని రౌండ్ల కాల్పులు గాల్లోకి జరిపాడు. ఈ మొత్తం తతంగం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.