‘కోహ్లితో అతడికి పోలికే లేదు’..షోయబ్ అక్తర్
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ రెండవ మ్యాచ్ కూడా ఓటమి పాలవడంతో తమ ప్లేయర్లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లే మండిపడుతున్నారు. పాక్ స్టార్ పేసర్ బాబర్ అజాం ఒక మోసగాడని, అతనికి ఒక రోల్ మోడల్ అంటూ ఎవరూ లేరని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ విమర్శలు కురిపించారు. కోహ్లీతో బాబర్‌కు పోలికే లేదన్నాడు. అసలు ప్రస్తుత పాక్ జట్టుపై మాట్లాడే ఆసక్తే తనకు లేదన్నాడు. విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో చెలరేగాడని, సచిన్‌ను రోల్ మోడల్‌గా తీసుకుని అతని రికార్డులకు చేరువవుతున్నాడని ప్రశంసించాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ విఫలమయిన పాకిస్తాన్ జట్టు తన సెమీస్ అవకాశాలను కూడా దాదాపు పోగొట్టుకుందని మండిపడ్డాడు.