తన ఆదాయంలో 10 శాతం పేదలకు ఇస్తా..
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ దాతృత్వాన్ని చాటుకున్నాడు. తనకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఆర్ధిక సాయం అందించనున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు పంత్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్టు చేశాడు. కఠిన సమాయాల్లో ఎలా ధైర్యంగా ఉండాలో తనకు ఎదురైన అనుభవాల ద్వారా నేర్చుకున్నట్లు తెలిపాడు. క్రికెట్ తనకు అన్నీ ఇచ్చిందని తెలిపాడు.