NewsTelangana

ఎమ్మెల్యేల ఎర కేసు.. సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుపై సిట్‌ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. సిట్‌ చీఫ్‌, హైదరాబాద్‌ కమీషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో దర్యాప్తు పారదర్శకంగా చేయాలని ఆదేశించింది. దర్యాప్తునకు సంబంధించిన విషయాలను మీడియాకు రాజకీయనాయకులకు వెల్లడించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. కేసు దర్యాప్తుపై పురోగతిని ఈనెల 29న సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.