తెలంగాణా అసెంబ్లీలో హరీష్ రావు Vs మంత్రి పొన్నం
తెలంగాణాలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ రోజు సభలో తెలంగాణా ఆర్టీసీపై వాడీవేడీ చర్చ జరిగింది. ఈ చర్చలో హరీష్ రావు ,మంత్రి పొన్నం ప్రభాకర్ నువ్వా-నేనా అన్నట్లుగా తలపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆర్టీసీ సిబ్బందిని ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తారని సర్కార్‌ను ప్రశ్నించారు. అలాగే రూ.300కోట్ల చెక్కు ఇచ్చిన నిధులు రాలేదని హరీష్ రావు కామెంట్ చేశారు. అంతేకాకుండా తెలంగాణాలో ఆర్టీసీ యీనియన్లను ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారని హరీష్ ప్రభుత్వాన్ని అడిగారు.కాగా హరీష్‌రావు ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధీటైన సమాధానాలు ఇచ్చారు. అయితే ఆర్టీసీ యూనియన్లను రద్దు చేసింది గత ప్రభుత్వమే పొన్నం గుర్తుచేశారు.ఈ విధంగా గత ప్రభుత్వం ఆర్టీసీని చంపేసిందని మంత్రి విమర్శించారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలంతా ఆర్టీసీ కార్మికులకు క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

