కొత్తపార్టీ దిశగా తొలి అడుగు వేసిన గులాంనబీ ఆజాద్
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇవాళ రాజకీయ పార్టీ ఆరంభం దిశగా అడుగులు వేశారు. పార్టీ గుర్తు, జెండాను ప్రజలే నిర్ణయిస్తారన్న ఆయన… జమ్ము, సైనిక గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారారు. తన జీవితం జమ్ము, కశ్మీర్ ప్రజలకు అంకితమన్నారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తానన్నారు. పార్టీ జమ్ము, కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతుందన్నారు. ఆజాద్ రాకతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పార్టీ పేరుపై ఇప్పటి వరకు ఒక నిర్ణయానికి రాలేదన్న ఆజాద్… ప్రజలకే ఆ బాధ్యత అప్పగిస్తున్నానన్నారు. అందరికీ అర్థమయ్యేలా పార్టీకి హిందుస్తానీ పేరును ఖరారు చేస్తానన్నారు ఆజాద్. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే ఉద్దేశం లేదని ఆజాద్ ఇప్పటికే స్పష్టం చేయడంతో ఆయన ముందు నేషనల్ కాన్పరెన్స్, పీడీపీ రెండు పార్టీల ఆప్షన్లే ఉన్నాయ్.
