ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా గిన్నిస్ రికార్డు
బ్రెజిల్‌కు చెందిన ఓ వివాహిత జంట ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా గిన్నిస్ రికార్డు సృష్టించారు. కాగా బ్రెజిల్‌కు చెందిన గాబ్రియెల్ ద సిల్వ బర్రోస్(31),కట్యుసియా లై హోషినో (28) గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. గాబ్రియెల్ ఎత్తు 90.28 సెం.మీ కాగా,కట్యుసియా ఎత్తు 91.13 సెం.మీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జంట 2006లో మొదటిసారి కలుసుకున్నారు. కాగా వీరు 15 సంవత్సరాల తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారు మాట్లాడుతూ..తాము పొట్టిగా ఉన్న తమ మనసులు చాలా పెద్దవని ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉందని చెబుతున్నారు.