Home Page SliderTelangana

గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదల

గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ ను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకారమైతే.. ఆగస్టు 7,8, తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో వాయిదా పడ్డాయి. దీంతో గ్రూప్ 2 పరీక్షల కొత్త షెడ్యూల్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారు.