Andhra PradeshHome Page Slider

ఏపీలో గ్రూప్-1 ఫలితాలు విడుదల

ఏపీలో గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. అయితే గ్రూప్-1లో ఖాళీగా ఉన్న మొత్తం 111 పోస్టలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.  అయితే జనవరి 8న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ను ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షకు 88 వేలమంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 1:50 నిష్పత్తిలో మొత్తం 6,455 మంది ప్రిలిమ్స్‌కు ఎంపికయ్యారు. ఈ 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామ్ రాయగా.. వారిలో 259 మంది అర్హత సాధించారు. దీంతో ఈ 259 మంది ఇప్పుడు ఇంటర్వ్యూకు  ఎంపికయ్యారు. కాగా వీరిలో 39 మంది స్పోర్ట్స్ కోటా నుంచి ఎంపికయ్యారు.కాగా ఈ ఏడాది జూన్ 3 నుంచి 10వ తేది వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షలు నిర్వహించిన 34 రోజుల్లోనే ఫలితాలు వెలువడ్డాయి.