ఢిల్లీలో గవర్నర్ తమిళిసై బిజీబిజీ
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెల్లడైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ ఈ నెల 12వ తేదీన పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. ఈ పర్యటనకు సంబంధించి కూడా గవర్నర్ చర్చించే అవకాశం ఉంది. ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై కూడా అమిత్ షాతో గవర్నర్ చర్చించే అవకాశం ఉందని సమాచారం.

