అమెరికాకు గొటబయి రాజపక్స
శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభానికి కారణం అయ్యారని పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయి శ్రీలంక నుంచి పరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మొదట మాల్దీవులు, తరువాత సింగపూర్ వెళ్ళారు. కొన్ని కారణాల వల్ల సింగపూర్ ప్రభుత్వం ఆయనను ఆ దేశంలో ఉండడానికి అనుమతించలేదు. దీంతో ఆయన అక్కడ నుంచి థాయ్‌లాండ్‌కు చేరి ప్రస్తుతం బ్యాంకాక్‌లోని ఒక హోటల్‌లో ఉన్నారు.

అయితే ఆయన మరి కొన్ని రోజుల్లో ఆ దేశాన్ని సైతం వీడాల్సి ఉంది. కాబట్టి ఆయన అమెరికాలో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు శ్రీలంక పత్రిక డైలీ మిర్రర్ వెల్లడించింది. గొటబాయి భార్య రోమా అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన అమెరికా గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హుడే. గొటబాయి తన భార్య ,కుమారుడితో కలిసి ఇకపై అమెరికాలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో భార్యతో కలిసి ఉంటున్న ఆయన ఈ నెల 25న ఒకసారి శ్రీలంకకు తిరిగి వస్తారని సమాచారం.
Read more: కేజ్రీవాల్ సర్కారుకు సీబీఐ షాక్.. మంత్రుల నివాసాల్లో సోదాలు