ఏపీలో టీచర్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్
ఏపీలో డిఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేస్తున్నామని విద్యామంత్రి బొత్ససత్యనారాయణ ప్రకటించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ, ఎన్ని పోస్టులు భర్తీ చేయాలో నివేదిక సిద్ధం చేస్తున్నామన్నారు. టీచర్ పోస్టుల భర్తీ కోసం జూలై- ఆగస్టులో డిఎస్సీ నిర్వహణకు ప్రయత్నిస్తున్నామన్నారు. నివేదిక సిద్ధమైన పిదప సీఎం జగన్‌కు అందజేసి, అనుమతులు తీసుకుని డిఎస్సీని ప్రకటిస్తామన్నారు. ఇప్పటివరకూ వివిధ దశలలో 12,540 పోస్టులను భర్తీ చేశామని వివరణ ఇచ్చారు. టెట్ పరీక్ష క్వాలిఫై అయిన వారు డిఎస్సీకి అర్హులు.