Home Page SliderTelangana

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త అందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ సేవర్ 59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మూడు ఆఫర్లకు ప్రయాణికుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోందని తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు మూడింటిని పొడిగిస్తున్నట్లు ఎల్అండ్ టీ, ఎంఆర్ హెచ్ఎల్ (మెట్రో రైల్ హై దరాబాద్ లిమిటెడ్) సోమవారం ప్రకటించాయి. సూపర్ సేవర్ 59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్ల డెడ్లైన్ ఆదివారంతో ముగిసింది. దీంతో మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

సూపర్ సేవర్ 59: సెలవు రోజుల్లో కేవలం రూ. 59తో రోజంతా మెట్రోలో అపరిమితంగా జర్నీ చేయొచ్చు. ఇది ఎల్అండ్ టీ, ఎంఆర్ హెచ్ఎల్ లిస్టులో ఉన్న సెలవు రోజుల్లో అందుబాటులో ఉంటుంది.

స్టూడెంట్ పాస్: ఈ ఆఫర్ ద్వారా స్టూడెంట్లు 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు జర్నీ చేయొచ్చు.

సూపర్ సేవర్ ఆఫ్ పీక్: రద్దీ లేని సమయాల్లో స్మార్ట్ కార్డు జర్నీపై 10% తగ్గింపు. ఉదయం 6 నుంచి 8, రాత్రి 8 తర్వాత ఈ ఆఫర్ అప్లయ్ అవుతుంది.