Andhra PradeshHome Page Slider

ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

ఏపీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. అదేంటంటే ఏపీలోని వివిధ శాఖలు,శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించనుంది. కాగా ఏపీలో ఒప్పంద ఉద్యోగుల పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ఆర్థికశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది లేదా ఆ పోస్టుల్లో శాశ్వత నియామకాలు జరిగే వరకు ఏది ముందైతే అంత వరకు వీరి ఒప్పందం పొడిగించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక CSలు,ముఖ్యకార్యదర్శులు,శాఖాధిపతులు,కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం పట్ల ఏపీ ఒప్పంద ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒప్పంద ఉద్యోగులకు వీలైనంత త్వరగా శాశ్వత నియామకాలు జరిగేలా చూడాలని వారు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.