అంతర్జాతీయంగా దిగొచ్చిన చమురు ధరలు
ఈ మధ్యకాలంలో నిత్యావసర ధరలు తారా స్థాయికి చేరుతున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా చమురు ధరలు మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ ధర ఒక్కొంటికి 92.31 డాలర్లు పలుకగా , వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడీయట్‌లో ధర మరింత తక్కువగా కనిపించింది. ట్రేడింగ్ కేవలం 86.61 డాలర్ల వద్ద నమోదైంది. ఇంతకముందు వరకు ఈ రెండు చోట్లా చమురు ధర 95.31 , 88.79 l డాలర్లు మేర పలికింది.

కొంతకాలంగా మార్కెట్ ధర స్లోధిరంగా ఉండగా , దేశీయ ఇంధన అమ్మకాల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు జరగడం లేదు. చమురు ధరలతో ఆర్థిక భారం నుండి ఊరట కొంత లభించినా , వాహనదారులకు మాత్రం చమురు కంపెనీలు ఎటువంటి ఊరటను ఇవ్వడం లేదు. కొత్తగా జారీ చేసిన ధరల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ రూ.96.72 పైసలు , డీజిల్ రూ.89.62 పైసలుగా ఉంది.

మహారాష్ట్రలో రెండోసారి వ్యాట్‌ను తగ్గించిన తర్వాత ముంబైలో లీటర్ పెట్రోల్ పై రూ.5 పైసలు , డీజిల్ పై రూ.3 పైసలు తగ్గింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03 పైసలు , డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంది. అదే విధంగా చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63 , డీజిల్ 94.24 , బెంగుళూరులో పెట్రోల్ రూ.101.94 , డీజిల్ రూ. 87.89 పైసలు , లక్నోలో పెట్రోల్ రూ96.57 , డీజిల్ 89.76 పైసలు , విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు , డీజిల్ 98.38 పైసలుగా రికార్డయింది. అహ్మదాహద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు , డీజిల్ రూ. 92.38 పైసలు , హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.67 , డీజిల్ రూ.97.82 పైసలుగా రికార్డయింది. పాట్నాలో పెట్రోల్ రూ.107.24 , డీజిల్ రూ.96.67 పైసలుగా ఉంది.

