Home Page SliderTelangana

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో గిరిజనులకు ఇలా న్యాయం చేయండి..బీజేపీ

భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖలో గిరిజనులకు రిజర్వేషన్లు, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో  హైదరాబాదులోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా తండాలలో గిరిజనులపై అక్రమంగా బనాయించిన గుడుంబా కేసులను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు.

01.వైన్స్ టెండర్ల లో గిరిజనులకు ఐదు శాతం నుంచి 10% రిజర్వేషన్లు అమలు చేయాలి.

02.గిరిజన ఉద్యోగులలో ప్రమోషన్లను 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.

03.ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ 10% అమలు చేయాలి.

05.తండాలలో బెల్టు షాపులను పూర్తిగా అరికట్టాలి.

06.బ్రీచ్ కేస్ పేరుతో గిరిజనులపై అక్రమంగా బనాయించిన కేసులను మరియు లక్ష రూపాయల వరకు వేస్తున్న జరిమానాలను తొలగించాలి.

07.గిరిజనులపై గుడుంబా కాస్తున్నారని ముసుగులో అక్రమంగా బనాయిస్తున్న పీడీ యాక్ట్ తొలగించాలి.

08.తాండాలలో ఎక్సైజ్ దాడులను ఆపి బెల్టు షాపులను పూర్తిగా మూసివేయాలి.

09.జీవనోపాధిగా వస్తున్న సారాయి మానేసిన కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల జీవన ఉపాధి కల్పించాలి.

10.జీవో నెంబర్ 03 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాలలో 100% మద్యం దుకాణాలు గిరిజనులకే కేటాయించాలి.

పైన పేర్కొన్న డిమాండ్లన్నీ త్వర తగ్గిన చర్యలు తీసుకొని సత్వరం పరిష్కరించాలని కోరారు లేనియెడల సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు