Home Page SliderNational

గెట్ రెడీ ఫర్ “జైలర్” ట్రైలర్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా “జైలర్”. అయితే రజినీకాంత్ అభిమానులు  ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోన్న ఈ సినిమా ట్రైలర్  అతి త్వరలోనే రాబోతుంది. కాగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జైలర్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమా ఈ నెల10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో రజినీకాంత్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించారు. కాగా జైలర్ సినిమాకి అనిరుధ్ రవిచందర్ గీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “కావాలా” సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.