టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసానికి మోదీ కేబినెట్‌లో చోటు
ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల్లో కీలకంగా మారిన టీడీపీకి మోదీ కేబినెట్‌లో రెండు బెర్తులు ఖరారయ్యాయి. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.