అంబర్‌పేట్‌కి చెందిన నలుగురు విద్యార్థులు మిస్సింగ్..
స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నలుగురు విద్యార్థులు చదువుతున్నారు. అయితే.. స్కూల్ పరీక్షల్లో కాపీ కొడుతూ టీచర్ కి దొరికారు. దీంతో టీచర్ వారిని మందలించి..పేరెంట్స్‌కి ఈ విషయం చెప్పింది . పేరెంట్స్ కూడా ఆ విద్యార్థులను మందలించడంతో నలుగురు విద్యార్థులు కలిసి ఇంటి నుంచి పారిపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించారు.