బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వివేక్
వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి పంపించారు. బరువైన హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు. కుమారుడు వంశీకృష్ణతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు వివేక్ వెంకటస్వామి. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 15వ లోక్‌సభలో పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వివేక్ వెంకటస్వామి మాజీ పార్లమెంటు సభ్యుడు జి. వెంకట్ స్వామి రెండో కుమారుడు. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించారు. విశాఖ ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్. వివేక్ వెంకట స్వామి గత పదేళ్లుగా రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారడమన్నది సాధారణంగా జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి, ఆ తర్వాత బీజేపీలోకి, ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వివేక్ ను కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా కొద్ది రోజులుగా కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
