Andhra PradeshHome Page Slider

చంద్రబాబుతో మాజీ మంత్రి నారాయణ ములాఖత్

ఇన్నింగ్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి నారాయణ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ అయ్యారు. నారా భువనేశ్వరి, బ్రహ్మణీలతోపాటుగా నారాయణ చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. రాజధాని భూముల వ్యవహారం, రింగ్ రోడ్డు వ్యవహారం అంతా నారాయణ కనుసన్నల్లోనే జరిగిందని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే నారాయణను అరెస్ట్ చేసే అవకాశమున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ కుట్రపూరితమని ఈ సందర్భంగా నారాయణ చెప్పారు. కోర్టుతో తమకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రింగ్ రోడ్డులో తన భూమి సైతం కోల్పోయానన్నారు నారాయణ. 2001లో కొన్న 7 కోట్ల విలువైన తన భూమి రింగ్ రోడ్డులో పోయిందన్నారు. సొంత భూమిని పొగొట్టుకున్న తాను, అవినీతికి ఎందుకు పాల్పడతానని ప్రశ్నించారు.