మాజీ సీఎం మృతి
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ(92) మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. 1999-2004 మధ్య ఆయన కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా వివిధ కీలక పదవులు నిర్వహించారు. ఆయన సీఎంగా ఉన్నకాలంలో బెంగళూరులో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషి చేశారు. 2004-2008 మధ్య మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. 2009-2012 మధ్య కేంద్ర విదేశాంగమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన, 2017లో బీజేపీ పార్టీలో చేరారు. 2023లో అనారోగ్యం కారణంగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయనకు 2023లో కేంద్రప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు పద్మవిభూషణ్ వరించింది. ఆయన కొంతకాలంగా వయసు రీత్యా వచ్చే అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. బెంగళూరులోని సదాశివనగర్‌లో తుదిశ్వాస విడిచారు.