తెలంగాణలో బీజేపీ జిల్లా, అసెంబ్లీ నిర్వహణ కమిటీల ఏర్పాటు
తెలంగాణ బీజేపీలో ప్రధాని మోదీ నిజామాబాద్ సభ తర్వాత జోరు పెరిగింది. ఉత్సాహంగా అసెంబ్లీ ఎన్నికల కోసం కమిటీల ఏర్పాట్లు షురూ అయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశమయ్యింది. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులు ఇన్చార్జులు సమావేశం జరుగుతున్నది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డి కె అరుణ, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)శ్రీ బి ఎల్ సంతోష్ జి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ తరుణ్ చుగ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి& బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ ఎన్నికల కమిటీ సహ ఇంచార్జ్ శ్రీ సునీల్ బన్సల్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్, బిజెపి రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ & పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రకాష్ జావడేకర్, బిజెపి జాతీయ కార్యదర్శి & బిజెపి రాష్ట్ర సహా ఇంచార్జ్ శ్రీ అరవింద్ మీనన్, బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్లమెంట్ శ్రీ సోయం బాపూరావు, శాసనసభ్యులు శ్రీ ఎం రఘునందన్ రావు, బిజెపి మధ్యప్రదేశ్ ఇంచార్జ్ శ్రీ పి మురళీధర్ రావు, తమిళనాడు రాష్ట్ర సహ ఇంచార్జ్ శ్రీ బొంగులేటి సుధాకర్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి, శ్రీ గరికపాటి మోహన్ రావు ,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, శ్రీ దుగ్యాల ప్రదీప్ కుమార్, కుమారి బంగారు శృతి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, బిజెపి రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు పాల్గొన్నారు.

ముఖ్య నేతలను వివిధ కమిటీలకు చైర్మన్లుగా నియమించారు. మొత్తం 14 కమిటీలను వేశారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా రాజగోపాల రెడ్డి, మేనిఫెస్టే కమిటీ ఛైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, పబ్లిక్ మీటింగుల కమిటీ చైర్మన్‌గా బండి సంజయ్, మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా ఏలేటి మహేష్ రెడ్డి, ఆందోళనలు, పోరాటాల కమిటీకి విజయశాంతి, చార్జిషీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావు, ఈసీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా చైర్మన్‌గా ధర్మపురి అర్వింద్, కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డి ఉండబోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా నేడు రాబోతున్న విషయం తెలిసిందే.