అమెరికాలో కొత్త తెలుగు సంఘం ‘మాట’ ఏర్పాటు
అమెరికాలో ఇప్పుడున్న తెలుగు సంఘాలకు అదనంగా MATA అనే కొత్త తెలుగు సంఘం ఏర్పడింది. సుమారు 2,500 మంది తెలుగువారు హాజరవగా గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వేడుక అట్టహాసంగా సాగింది. తోటి తెలుగు ప్రజలకు సేవ, సంస్కృతి, సమానత్వం అందించడం కోసం సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మహిళా సాధికారత, యువతకు ప్రోత్సాహం, సీనియర్ సిటిజన్లకు ఉత్తమ సంరక్షణను అందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వారు చెప్పారు. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగువారికి ప్రధాన ప్రాధాన్యతగా అత్యుత్తమ సేవ కోసం న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో సంఘాన్ని అఫీషియల్‌గా ప్రారంభించారు. స్థానిక పాఠశాలలకు చెందిన దాదాపు 150 మంది యువకులు వివిధ నృత్య రూపాలను ప్రదర్శించారు.

శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, అట్లూరి, శ్రీధర్ చిల్లర, దాము గేదెల, స్వాతి అట్లూరిలతో కూడిన మాటా కోర్ టీమ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల సంస్థ లక్ష్యాన్ని వివరించారు. ‘సేవ, సంస్కృతి, సమానత్వం’ అనే మూడు ప్రధాన సూత్రాల ఆధారంగా ఈ సంస్థ పనిచేస్తోందని వెల్లడించారు. డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించిన, పార్థసారథి స్వరపరచిన మాటా- గీతం ఆకట్టుకుంది. 60 మంది విద్యార్థులు ప్రదర్శన చేశారు. స్వాతి అట్లూరి నృత్యాలు ఆకట్టుకున్నాయి. సంస్థ మిషన్, విజన్‌ని లక్ష్మీ మోపార్టీ యువ బృందం ప్రదర్శించింది.

న్యూజెర్సీ, న్యూయార్క్, గ్రేటర్ ఫిల్లీ, అల్బానీ, మేరీల్యాండ్, వర్జీనియా/DC, టంపా, డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, అట్లాంటా, చికాగో, డెట్రాయిట్, కాన్సాస్ సిటీ, నార్త్ కరోలినా, ఒహియో వంటి దాదాపు 20 నగరాల్లో MATA కార్యాలయాలను ప్రారంభించింది. సెయింట్ లూయిస్, లాస్ ఏంజిల్స్, CA, సీటెల్, మొదటి రోజు 2,000 కంటే ఎక్కువ మంది జీవిత సభ్యులుగా చేరారు. TANA, ATA, NATA, NATS, TFAS, TLCA, TAGDV & PTA ఇతర తెలుగు సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సరికొత్త సంస్థను వారు స్వాగతించారు. ప్రముఖ నేపథ్య గాయకులు సునీత, అనిరుధ్ ఎమ్‌లైవ్‌బ్యాండ్‌తో అద్భుత సంగీత కేచేరిని అందించారు. MATA టీమ్‌లు తమ వెబ్‌సైట్ www.mata-us.orgలో అన్ని భవిష్యత్ ప్రోగ్రామ్‌లు, ఇతర వివరాలను పోస్ట్ చేయనున్నట్లు తెలిపారు.