హైదరాబాద్ డ్రైనేజీ సమస్యలపై దృష్టి పెట్టండి..
హైదరాబాద్ లో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు హైదరాబాద్ లో వరదలు వస్తే కార్లు కొట్టుకుపోవడం, మనుషులు మ్యాన్ హోల్స్ లో పడిపోవడం చూశామన్నారు. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ లో ఆ సమస్యలు అలాగే ఉన్నాయన్నాయని గుర్తు చేశారు. గొప్ప నగరం అని చెప్పుకునే హైదరాబాద్ లో కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు.