దీపిక దుస్తులను సరిచేయండి… లేకుంటే సినిమా విడుదల కష్టమే..!
షారూఖ్ ఖాన్, దీపిక పదుకొణె నటిస్తున్న పఠాన్ వివాదాస్పదమవుతోంది. ఈ చిత్రంలో ఓ పాటలో నటి దీపికా పదుకొణె బికినీపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాలను “కరెక్ట్” చేయకపోతే, దాని స్క్రీనింగ్ గురించి ప్రభుత్వం ఏమి చేయాలో ఆలోచిస్తుందన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ కేసులో చూసినట్లుగా “తుక్డే తుక్డే గ్యాంగ్”కి దీపిక మద్దతుదారు అని మిశ్రా అన్నారు. “బేష్రామ్ రంగ్” అనే పాట ఇటీవల విడుదలైన తర్వాత మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాటలో కనిపించే బికినీలు అత్యంత అభ్యంతరకరమైనవని… కలుషిత మనస్తత్వం నుండి చిత్రీకరించబడినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఇండోర్‌లోని మోవ్ జిల్లాలో విలేకరులతో మిశ్రా మాట్లాడుతూ, పాటలో ఆమె పాటలో దుస్తులను సరిచేయమని అభ్యర్థిస్తున్నానన్నారు. లేకుంటే ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్‌లో అనుమతించాలా వద్దా అనేది పరిశీలించాలని మిశ్రా చెప్పారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన “పఠాన్” జనవరి 25న విడుదల కానుంది. అక్టోబర్‌లో మిశ్రా కూడా రామాయణం ఆధారంగా తీసిన బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్” నిర్మాతలను, హిందూ మతపరమైన వ్యక్తులను “తప్పు” మార్గంలో చూపించే దృశ్యాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.