ఫస్ట్ రివ్యూ…
రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున దిగ్గజ నటీనటులతో తెరకెక్కించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర.’ విజువల్ వండర్ గా ఈ సినిమాను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. 410 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 9న రీలీజ్ కానుంది. ఈ సినిమాపై బాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది.

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాను చూసిన ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్, బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తన రివ్యూను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో ఆత్మ లోపించిందని.. భారీ పబ్లిసిటీ… ఓపెనింగ్ రోజున, వీకెండ్ లో వసూళ్లను రాబట్టొచ్చని.. ఆ తర్వాత సినిమాకు కష్టాలు తప్పవని తెలిపాడు. ఫాంటసీ., అడ్వెంచర్ సినిమాలు బాలీవుడ్ లో చాలా తక్కువగా వస్తుంటాయని.. ఇలాంటి సినిమాను తెరకెక్కించినందుకు అయాన్ ముఖర్జీని ప్రశంసించాల్సిందేనని ఉమైర్ సంధూ పేర్కొన్నాడు. అయితే… ఈ మూవీలో స్టోరీ, స్ర్కీన్ ప్లే చాలా యావరేజ్ గా ఉన్నాయని తెలిపాడు. సినిమాలో రణబీర్ పాత్ర చాలా కన్ఫూజింగ్ గా ఉన్నాడని, అలియా భట్ స్టన్నింగ్ గా ఉందని ప్రశంసించాడు. అమితాబ్ నటన, విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాడు. మొత్తంగా చూస్తే ఉమైర్ సంధూ ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇచ్చాడు.