పాకిస్తాన్‌లో కాల్పులు-15 మంది మృతి
పాకిస్తాన్‌లో ఒక బొగ్గుగని పంపకం విషయంలో రెండు గిరిజన తెగల మధ్య ఘర్షణ చెలరేగింది. దీనితో వారు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘర్షణలో 15 మంది మరణించారు. చాలామంది గాయపడ్డారు. గాయపడిన వారిని పెషావర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఇరువర్గాల మధ్య చాలాకాలంగా ఘర్షణలు చెలరేగుతున్నాయి. వారిమధ్య రాజీ కుదిర్చేందుకు ఎన్నివిధాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. సన్నికేల్, జార్జున్ కేల్ తెగల మధ్య ఈ ఘర్షణ జరిగింది. వాయువ్య పాకిస్తాన్ ప్రాంతంలో పెషావర్‌కు 35 కిలోమీటర్ల దూరంలో వీరు నివాసం ఉంటున్నారు.