Home Page SliderTelangana

ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు

ఓ విచిత్ర ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో చోటుచేసుకుంది. ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. రెండు నెలల క్రితం ఓ భూ వివాదంలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అందులో విఠల్ అనే వ్యక్తి ఆరేళ్ల క్రితమే మృతి చెందాడు. ఈ క్రమంలోనే విచారణ కోసం పోలీసులు మృతి చెందిన విఠల్ ఇంటికి వెళ్లారు. విఠల్ గురించి కుటుంబ సభ్యులను అడగగా వారు అవాక్కయ్యారు. కనీస విచారణ చేయకుండా చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.