మరో వివాదంలో ఫిన్‌లాండ్ ప్రధాని
ఫిన్‌లాండ్ ప్రధాని సనా మారిన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక ప్రైవేటు పార్టీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్ చేస్తూ..బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఆ పార్టీకి సంబంధించిన డాన్స్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీంతో ఫిన్‌లాండ్‌లోని ప్రతిపక్షాలు ఆమెపై పలు రకాల విమర్శలతో విరిచుకు పడుతున్నాయి. ఆమె ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అంతేకాకుండా ఆమెకు డ్రగ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశాయి. అయితే ఈ విషయంపై సనా మారిన్ స్వయంగా స్పందించారు. ఆమె ఈ వీడియో గురించి మాట్లాడుతూ..ఆ డాన్స్ వీడియో తాను పాల్గొన్న ఒక ప్రైవేటు పార్టీకి సంబంధించినది అని స్పష్టం చేశారు. ఆ పార్టీలో తాను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని..కేవలం మద్యం మాత్రమే సేవించానని వివరించారు. ఈ వీడియో ఇలా బయటకు రావడం చాలా దురదుష్టకరంగా భావిస్తున్నానన్నారు. ఆ పార్టీలో చేసినవన్నీ చట్టానికి లోబడినవే అని తాను ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడించారు.