ప్రధాని మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం
ప్రధాని నరేంద్ర మోదీకి ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం లభించింది. ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా “ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ”తో సత్కరించింది. ప్రధాని మోదీ, ఫిజీ ప్రధాని సితివేణి రబుకా నుంచి పతకాన్ని అందుకున్నారు. ఇప్పటి వరకు ఫిజియేతరులు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు.