గిరిజన ప్రాంతాలలో ఫీడర్ అంబులెన్స్‌లు తిరగాలి- చంద్రబాబు
గిరిజన సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఆ ప్రాంతాలలో డోలీలు కనిపించకూడదని, ఫీడర్ అంబులెన్స్‌లు తిరగాలని సూచించారు. గిరిజన మహిళలకు సౌకర్యం కోసం వసతి గృహాలు, గర్భిణులకు అంబులెన్సులు, వైద్యసౌకర్యాలు కలిపించాలని ఆదేశించారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలను ఏక్టివేట్ చేయాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానం వల్ల గిరిజనుల జీవన ప్రమాణాలు దిగజారిపోయాయని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేడ్కర్ ఓవర్ సీస్ విద్యానిధి వంటి పథకాలకు తిలోదకాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.