Breaking NewsHome Page SliderInternationalNational

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం

ప‌శ్చిమ దేశాల్లో విమాన ప్ర‌మాదాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.గ‌త ఏడాది రెండు విమాన ప్ర‌మాదాల్లో దాదాపు 270 మంది చ‌నిపోయారు.కొరియ‌న్ విమానం, అజ‌ర్‌బైజాన్ విమానాలు అదుపు త‌ప్పి నేల‌కూడంతో వంద‌ల సంఖ్య‌లో ప్ర‌యాణీకుల ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి.తాజాగా… వాషింగ్టన్ రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో గాల్లో ఉన్న విమానం…మిలిటరీ హెలికాఫ్టర్‌ను ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ప్రమాదం అనంతరం విమానం, హెలికాప్టర్ రెండూ పోటోమాక్ నదిలో కూలిపోయాయి.ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు,హెలికాఫ్ట‌ర్‌లో 4గురు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది.మృతుల సంఖ్య పూర్తిగా తెలియాల్సి ఉంది.