NationalNews

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయను

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదన్నారు జమ్ము & కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. ఇప్పటికే రేసు నుంచి కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తప్పుకున్నారు. తాజాగా ఫరూక్ అబ్దుల్లా వెనుకడుగేయడంతో… విపక్షాల్లో ఆందోళన నెలకొంది. ఇంకా యాక్టివ్ పాలిటిక్స్‌లో కొనసాగాలని భావిస్తున్నానని.. అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు అబ్దుల్లా. జమ్ము & కశ్మీర్ లో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయలేనన్నారు. 84 ఏళ్ల అబ్దుల్లా అటు జమ్ము& కశ్మీర్ రాజకీయాల్లోనే కాక… దేశ వ్యాప్తంగా కీలక నేతగా గుర్తింపు పొందారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించేందుకు ముంబైలో భేటీ అవుతున్న తరుణంలో అబ్దుల్లా నిర్ణయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బెంగాల్ సీఎం మమత బెనర్జీ తన పేరును ప్రతిపాదించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.