రైతులకు ఎరువుల కరువు వచ్చింది
తెలంగాణలో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఏర్పడిందని, రైతులకు ఇచ్చిన భరోసా, రుణమాఫీ హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. యూరియా బస్తా ధర రూ.266 నుంచి రూ.325కి పెరగడం వెనుక కారణాలను ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎరువుల కొరత కృత్రిమంగా సృష్టించారని, వాటిని బుక్కేస్తున్న మేతన్నలెవరో గుర్తించి తక్షణ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆరోపణలు రాష్ట్రంలో సాగు సంక్షోభంపై తీవ్ర చర్చకు దారితీశాయి.