Breaking Newshome page sliderHome Page SliderInternationalNewsviral

దిగొస్తున్న బంగారం ధరలు

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. ఇటీవల పెరగడమే కానీ, తగ్గడం లేని బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో భవిష్యత్ అవసరాల కోసం వాటిని ఇప్పుడే కొనుగోలు చేయటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పండుగల వేళ డిమాండ్ ఎక్కువ ఉంటుంది గనుక అది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,11,170గా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,01,900గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,41,000గా ఉంది.ముంబైలో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,700 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ. 1,02,390 ఉంది.