Home Page SliderTelangana

యశోదా ఆస్పత్రిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హంగామా

హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ లీడర్లు హంగామా సృష్టించారు. సెక్యూరిటీ సిబ్బంది, స్టాఫ్ పై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఓ యూట్యూబర్ ను పరామర్శించడానికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు యశోద హాస్పిటల్ కు వెళ్లారు. అయితే ఆస్పత్రిలో సెల్ ఫోన్ తో వీడియో తీస్తున్న వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య గొడవ జరిగిననట్లు సమాచారం. కాగా… మాజీ మంత్రినే వీడియో తీయొద్దు అంటావా అంటూ జగదీశ్వర్ రెడ్డి అనుచరులు సెక్యూరిటీ సిబ్బంది, స్టాఫ్ పై దాడి చేశారు.