అసెంబ్లీలో దద్దరిల్లిన ప్రజాగళం ఈటల
జర్నలిస్టులు, కెమెరామాన్, ఫోటో గ్రాఫర్, డెస్క్ జర్నలిస్టులకు అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ళస్థలాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిన్న పత్రికలో పని చేసే వారికి జీతాలు ఉండవని… వారికి యాడ్స్ ఇచ్చి ఆదరించాలన్నారు. కొన్నిటికి మంచిగా ఇస్తున్నారు, కొన్నిటికి తక్కువ అనే వివక్ష లేకుండా ఉండాలన్నారు. జర్నలిస్టులకు ప్రమాదబీమా అందించాలన్నారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీం లో జర్నలిస్ట్ అందరికీ ఉచిత వైద్యం అన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో అందించాలని, వారి పిల్లలకు స్కూల్ ఫీజులు భారం పడకుండా చూడాలన్నారు ఈటల. సోషల్ మీడియాను నియంత్రించాలని చూడడం సరికాదని… అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

తెలంగాణ ఉద్యమంలో మున్సిపల్ కార్మికులు ముఖ్యపాత్ర పోషించారన్నారు ఈటల. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యాలన్నారు. అన్నమో రామచంద్ర అంటూ మురికిలో పనిచేస్తున్న వారికి జీతం పెంచాలన్నారు. సీఎం హామీ ఇచ్చినట్టు మున్సిపల్ కార్మికులకు ఇళ్ళస్థలాలు ఇవ్వాలన్నారు. విధుల్లోంచి తొలగించిన 700 చిన్న చిన్న ఉద్యోగులను మళ్లీ తీసుకోవాలన్నారు ఈటల. GHMC అప్పుల నిలయంగా మారిందని తక్షణం బకాయిలు చెల్లించాలన్నారు.

స్మార్ట్ సిటీ అని చెప్తున్నాం కానీ కరీంనగర్ లో రోడ్లు సారిగా లేవన్నారు ఈటల. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్… ఎస్సీ ఎస్టీ లకు ఇచ్చే ఇన్సెంటివ్స్ వెంటనే విడుదల చెయ్యాలన్నారు ఈటల. చేనేత కార్మికులకు ఎన్ని చేసినా ఇంకా వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయన్నారు. యార్న్ సబ్సిడీ, త్రిఫ్ట్ ఫండ్ సకాలంలో అందిస్తే వారికి ఉపశమనం కలుగుతుందన్నారు. చేనేతలు ప్రశాంతంగా జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఐటిరంగంలో వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారని… కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేలా నిర్ణయాలు ఉండాలన్నారు. రాయితీలు ఇస్తున్నందున తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో గుళ్ళ సంఖ్య పెరుగుతోందని… 300 కోట్లు కేటాయించి.. పోచమ్మ గుళ్ళకు12.5 లక్షలు ఇస్తున్నారని… దాన్ని 20 లక్షలకు పెంచాలన్నారు ఈటల.

రూ. 11 వేల కోట్లు సబ్సిడీ పెట్టారు. కాళేశ్వరం రూ. 3500 కోట్లు కరెంటు వాడుకున్న వాడుకొకపోయినా కట్టాల్సి వస్తుందన్నారు. 101 యూనిట్ల వరకు దళితులకు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం… 25 లక్షల పంప్ సెట్స్ పెరిగాయి అని చెప్పినప్పుడు దానికి అవసరమైన విద్యుత్ బకాయిలు చెల్లించాలన్నారు. 24/7 విద్యుత్ గ్రామీణ ప్రాంతాల్లో రావడం లేదన్నారు ఈటల. విద్యుత్ అందుబాటులో ఉందని… నాట్లు వేసుకున్నారని పంటలు ఎండిపోకుండా కరెంటు ఇవ్వాలన్నారు. దళిత కాలనీలో మీటర్లు లేవని నిర్ధాక్షిణ్యంగా కరంటు బంద్ చేస్తున్నారని… మానవతా కోణంలో ఆలోచన చేసి దళిత కాలనీలలో మీటర్ల సమస్యని పరిష్కరించాలన్నారు. లోయర్ మానేరులో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ వ్యతిరేకిస్తున్నానన్నారు. మత్స్య కారులకు అన్యాయం చేయొద్దన్నారు ఈటల.

రెసిడెన్షియల్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది అనుకుంటున్నామన్నారు ఈటల. మండల స్థాయిలో ఉన్న పెద్ద స్కూల్స్ కి అటాచ్డ్ గా హాస్టల్ కడితే.. ఆ స్కూల్ గొప్పగా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ స్కూల్ లో 1623 కంటింజంట్ వర్కర్ గా పనిచేస్తున్న వారికి 8 వేల జీతం పెంచాలి. 33 జిల్లాలో 21 జిల్లాలో deo లు లేరని… ఒక్క MEO లేరన్నారు. జనగాంలో 12 మండలాలు ఉంటే ఒక్క MEO లేరన్నారు. 1650 గెస్ట్ లెక్షరర్స్ కి 12 నెలలు జీతం స్కేల్ జీతం ఇవ్వాలన్నారు. విశ్వవిద్యాలయంలో 95% పేద విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ఉన్నవారి విశ్వవిద్యాలయాలు, లేని వారి విశ్వవిద్యాలయాలు వేరు వేరు విభజించడం దారుణమన్నారు. మెస్ చార్జీలు కట్టకుండా బువ్వపెట్టాలి. స్టాఫ్ ఏర్పాటు చెయ్యాలి. కొమరయ్య, మల్లయ్య కొడుకు చదువుకుంటే kt రామారావు గారితో పోటీ పడతారన్నారు. అన్యాయం జరిగితే ఇది అన్యాయం అనించెప్పగలిగే శక్తి ఉన్న వాడిని తానన్నారు ఈటల.

ఒకప్పుడు 1 లక్ష 20 వేల మందితో కలిగిన సింగరేణి. తెలంగాణ వచ్చాక సింగరేణి సామర్థ్యం 50 నుండి 65 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది. కానీ కార్మికుల సంఖ్య 43 వేలకు పడిపోయిందన్నారు ఈటల. అన్నీ లాభనస్టాల కోసం పని చేయకూడదన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కి అప్ప జెప్పకుండా మైన్స్ ను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. కోల్ ఇండియా కాంట్రాక్ట్ ఉద్యోగులకు రోజుకి 935/- ఇస్తుంటే… సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులకు 435/- మాత్రమే ఇస్తున్నారన్నారు. కేంద్రాన్ని 10 మైన్స్ అడగండి ఇవ్వకపోతే అసెంబ్లీలోనే తాను కన్పించనన్నారు ఈటల. శ్రావణపల్లి వయబుల్ కాక వదులుకుంటున్నామని… కానీ కేంద్రాన్ని ఇవ్వడం లేదు అని బదనం చేస్తున్నారన్నారు. అండర్ గ్రౌండ్ మైన్ పెడితే డబ్బులు తక్కువ రావచ్చు కానీ కార్ముకులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఒకప్పుడు డిపాజిట్లు ఉన్న సింగరేణి, ఇప్పుడు అప్పుల పాలు అయ్యిందన్నారు. బొగ్గుకి డబ్బులు ఇవ్వకపోవడం..కరెంటుకి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం 25 వేల కోట్ల రూపాయలు సింగరేణికి బకాయిలు పడిందన్న ఈటల… వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలి డిమాండ్ చేశారు.