NewsTelangana

అమిత్ షా తో ఈటెల రాజేందర్ భేటీ

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని భావిస్తున్న బీజేపీ హైకమాండ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల పై పూర్తి క్లారిటీ తో అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని భావిస్తున్న ఢిల్లీ పెద్దలు అందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లో మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఢిల్లీ పిలుపు వచ్చింది. రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈటెల ను అమిత్ షా ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది