కేసీఆర్‌కు ఓ రేంజ్‌లో ఈటల కౌంటర్
తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతోంది కేసీఆరే!
దేశంలోనే అత్యధిక ద్రవోల్బణం తెలంగాణలో
కేసీఆర్, కేటీఆర్ మాటలను పట్టిచుకోనక్కర్లేదు
మోసానికి ద్రోహానికి మారుపేరు కేసీఆర్.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఈటల
చాలా రాష్ట్రాలు ఎలక్షన్ సంవత్సరంలో ఓట్లు ఎలా సంపాదించాలి అనే కోణంలోనే బడ్జెట్ పెడుతుంటే… మోదీ ఏ ఒక్క సంవత్సరం కూడా అనవసర హామీలు ఇవ్వడంలేదన్నారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. మోదీ ప్రజలను మభ్యపెట్టడం లేదని… అసలు మాయే చేయడం లేదన్నారు. తాజా బడ్జెట్ పూర్తి ప్రాక్టికల్‌గా ఉందన్నారు. 4 శాతం ఉన్న ద్రవ్యోల్బణం కరోనా సమయంలో 9.5 % కాగా, ఇప్పుడు అది 6.2 % కి తీసుకువచ్చారని.. తిరిగి 4 % తెచ్చేందుకు కృషి చేస్తామని నిర్మల సీతారామన్ చెప్పారన్నారు. రైల్వేలతో కలిపి 13 లక్షల కోట్లు కాపిటల్ ఎక్స్పెండిచర్ కేటాయించారన్నారు. బడ్జెట్‌లో యువతకి ఉపాధి, దేశానికి పురోగతి పెద్దపీట వేశారన్నారు. వంద లక్షల కోట్లు అప్పు చేశారని పదే పదే విమర్శిస్తున్నారని… మాటలు ఎన్నైనా చెప్పొచ్చని లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాళ్ళకింద భూమి కదులుతుందే… కేంద్రంపై అబద్ధాలు చెప్తున్నారన్నారు. కేంద్రం చేసే అప్పులన్నింటికీ ఒక పద్దతి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు దమ్ముంటే చర్చకు రావాలన్నారు. 2014-15లో GSDP లో మన రాష్ట్రం అప్పు 15 శాతం. అది 2021-22 లో 28.8 % పెరిగి డబుల్ అయ్యిందన్నారు. కేంద్రం అప్పు, 2014-15: 50.1 % ఉంటే 19-20 : 48.7 % జీడీపీ లో 1.4% అప్పు తగ్గిందన్నారు. రాష్ట్రానికి NCDC, REC, POWER FINANCE CORPORATION, NABARD ఇవన్నీ కేంద్రం ఇస్తున్న అప్పులు కావా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ 1.05 లక్షల గ్యారంటీ రుణాలు తెచ్చారన్నారు. 3.83 వేల కోట్లు FRBM అప్పులు తెచ్చారని… మొత్తం 5 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. జనాభాతో పోలిస్తే..1.2 లక్ష రూపాయలు ఒక్కో వ్యక్తి మీద అప్పు చేశారని చెప్పారు ఈటల.

దేశంలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని… పాలన కేసీఆర్ అధపాతాళంలో ఉన్నారన్నారు. దేశంలోనే సీనియర్ నాయకుడని చెప్పుకునే కేసీఆర్… ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్ దగ్గర ఏం చేయాలని నేర్చుకోవడమన్నది విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ కేబినెట్‌లోనే ఎవరైనా ఒక్క మంత్రైనా… పదవి కాలంలో ఒక్కసారైనా ఆయా శాఖలను సమీక్షించారా అని ప్రశ్నించారు ఈటల. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నానంటూ చెప్పుకుంటున్నారని… ఇవ్వడం లేదని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. రాజకీయాల నుండి తప్పుకుంటా.. మీ సీఎండీ ఒప్పుకున్నాక… ఇంకా 24 గంటలు ఇస్తున్నామని చెప్పుకోడానికి సిగ్గుండాలన్నారు. 300 ఎకరాల సీఎం కూడా 30 లక్షల రైతు బంధు తీసుకోవడం సిగ్గులేని తనమన్నారు. బెంజ్ కారులో వచ్చిన వారికి రైతుభందు ఇవ్వడం దుర్వినియోగం కాదా అని ఈటల ప్రశ్నించారు. గత ఏడాది ఆగస్టు నెల వృద్ధాప్య పింఛన్ ఎగరగొట్టిన ఘనత కేసీఆర్‌దని దుయ్యబట్టారు ఈటల.

కమలాపూర్‌లో నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన భవనాలకు ఇప్పుడు మళ్లీ శిలాఫలకాలు వేయించుకోడవానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు ఈటల. రాజుల కాలంలో ఈ రాజు కట్టించెను అని రాసుకున్నట్టుగా ఉందంటూ ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్‌లో బ్రోకర్లను, చీటర్లను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారన్నారు. సీఎం సడ్డగుడు..మానెరులో ఇసుకను తరలించుకు పోతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. 2014 లో మీ ఆస్తులెన్ని మావి ఎన్ని.. 2023లో మీ ఆస్తులెన్నో చర్చకు సిద్ధమా అంటూ ఈటల సవాల్ విసిరారు. తెలంగాణలో 52 శాతం జనాభా ఉన్న బీసీల్లో ఎందరికి మంత్రి పదవులు దక్కాయని ప్రశ్నించారు. క్రీమ్ శాఖలన్నీ కూడా తన కులానికే ఇచ్చుకున్నారని… కాదంటే చర్చకు రావాలని ఈటల డిమాండ్ చేశారు. కేంద్రంలో మొత్తం 33 శాతం బీసీలుంటే 27 శాతానికి మంత్రు పదవులిచ్చారని చెప్పారు. 12 మంది దళితులు మంత్రులున్నారని, మాదిగ, ఆదివాసీలకు తెలంగాణలో ఒక్కటంటే ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. ఆదివాసి బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదన్నారు ఈటల.

తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే శైలి కేసీఆర్‌కు వందకు వంద శాతం సరిపోతుందన్నారు ఈటల. తెలంగాణ ఉద్యమంలో RSS నుండి RSU వరకు రమ్మన్నారు.. JAC పెట్టారు. మరి కోదండరామ్, మంద కృష్ణ, విమలక్క పరిస్థితి ఏంది? వారిని ఎం చేశారు. 2018లో ఏసీబీ, ఈడి, ఇన్కం టాక్స్‌కి ఒక దళితునితో కంప్లైంట్ చేయించారు. వాల్ పోస్టర్స్ వేయించారు. కౌశిక్ రెడ్డికి నన్ను ఓడగొట్టడానికి డబ్బులు పంపిన మీరు తల్లి పాలు తాగి రొమ్ముగుద్దారన్నారు. తెలంగాణ కోసం ఎన్ని దుర్మార్గాలు చేసిన దిగమింగి ఉన్నామన్నారు ఈటల. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందరు ఓడిపోలేదన్నారు ఈటల. టికెట్ ఇస్తే ఎన్నడూ ఓడిపోలేదన్నారు. మీ గౌరవం పెంచలేదా ? మీ పార్టీని బలోపేతం చేయలేదా ? అంటూ ప్రశ్నించారు. NTRను ఎందుకు మోసం చేసావని మిమ్మల్ని ఎవరైనా అంటారా? కానీ పదేపదే నాపై విమర్శలెందుకని ప్రశ్నించారు ఈటల. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దింది కేసీఆర్ అని… మోసానికి ద్రోహానికి మారుపేరు కేసిఆర్ అన్నారు. కొడుకులాంటి వాడి మీద కుట్రలు చేయొచ్చా. కేసీఆర్ నా ఉసురు పోసుకున్నారని ఈటల మండిపడ్డారు.