Home Page SliderInternational

ఎలన్ మస్కా… మజాకా.. AI ఉపయోగించి ప్రపంచ దిగ్గజాలతో పరేడ్

ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఇవాళ ఎక్స్‌లో విచిత్రమైన పోస్ట్ పెట్టాడు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ ఘనత అంటూ పోస్ట్ పెట్టారు. ప్రపంచ దిగ్గజాలు ఫ్యాషన్ షోలో పాల్గొంటే ఎలా ఉంటుందన్నది వివరించాడు. ఈ ఫ్యాషన్ షోలో పోప్ మొదలు ప్రపంచ దిగ్గజాలందరినీ ఒక్కచోట చేర్చి హాస్యాన్ని పండించాడు. రష్యా అధ్యక్షుడు , అమెరికా అధ్యక్షుడు బైడెన్, మస్క్ ఇమేజ్ తో సహా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఫేస్ బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ చైనా అధ్యక్షుడు, కెనడా అధ్యక్షుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రపంచ దిగ్గజాలతో పరేడ్ నిర్వహించాడు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఇటివీల విండోస్ ప్రొబ్లమ్ వచ్చిన టెంప్లెట్ పట్టుకొని కన్పించడంతో వీడియో ఎండ్ అవుతుంది. తాజా వీడియో ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లోతును చెప్పినప్పటికీ.. మస్క్ యటకారమంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.