బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్‌కు సమన్లు
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా ఆన్‌లైన్ గేమింగ్ కేసులో రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రణ్‌బీర్ కపూర్ ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ రణ్‌బీర్ కపూర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రణ్‌బీర్‌తో పాటు పలువురు నటులు, సింగర్లను కూడా ఈడీ విచారించనున్నట్లు సమాచారం.ఈడీ ఇప్పటికే ఈ కేసులో రూ.417 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. ఈ కేసులో బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు హీరో రణ్‌బీర్ కపూర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.