సుదీర్ఘంగా విజయ్ దేవరకొండను విచారించిన ఈడీ
లైగర్ మూవీ పెట్టుబడులకు సంబంధించి నటుడు విజయ్ దేవరకొండను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 12 గంటల పాటు విచారించింది. లైగర్ మూవీలో పెట్టుబడులు ఎలా వచ్చాయన్నదానిపై ఈడీ ఆరా తీసింది. ఐతే విచారణ తర్వాత విజయ్ మీడియాతో మాట్లాడారు. “పాపులారిటీ పొందడం ద్వారా, కొన్ని ఇబ్బందులు, దుష్ప్రభావాలు ఉంటాయన్నాడు. ఇది ఒక అనుభవం, ఇది జీవితం. నేను పిలిచినప్పుడు నా డ్యూటీని నిర్వర్తించానన్నాడు. అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానన్నాడు. మళ్లీ ఈడీ పిలవదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఉదయం 8.30 గంటలకు విజయ్ విచారణ ప్రారంభించిన అధికారులు రాత్రి వరకు కొనసాగించారు. లైగర్ తెలుగు నటుడు తొలి హిందీ చిత్రంగా గుర్తింపు పొందింది. ₹ 100 కోట్ల బడ్జెట్‌తో దీన్ని రూపొందించినట్లు సమాచారం. అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా నటించాడు. ఐతే ఈ మూవీ బాక్స్ ఆఫీసు వద్ద విఫలమైంది. ఫ్లాప్ కావడంతో విజయ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇప్పటికే లైగర్ నిర్మాత ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ ను ఈడీ విచారించింది. ఫెమా ఉల్లంఘనలు జరిగాయని… ఈడీ విచారించింది. నవంబర్ 17న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇద్దరినీ ప్రశ్నించింది. దేవరకొండ 2011 తెలుగు చిత్రం ‘నువ్విలా’తో పరిచయం అయ్యాడు. 2017 బ్లాక్ బస్టర్ ‘అర్జున్ రెడ్డి’తో పాపులర్ అయ్యాడు.